Oct 07, 2026, 15:10 IST/
కిసాన్ క్రెడిట్ కార్డ్: రుణ పరిమితి పెంపు
Oct 07, 2026, 15:10 IST
రైతులకు వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తి అవసరాల కోసం 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం ప్రారంభమైంది. 2025-26 బడ్జెట్లో ఈ పథకం కింద రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు. 3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలపై 1.5% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది, దీంతో వడ్డీ రేటు 7% అవుతుంది. సకాలంలో చెల్లించేవారికి అదనంగా 3% రీ-పేమెంట్ ఇన్సెంటివ్ తో వడ్డీ రేటు 4%కి తగ్గుతుంది. రూపే కార్డ్ ద్వారా ఫ్లెక్సిబుల్ విత్డ్రాయల్, డిజిటల్ పేమెంట్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత రైతులు, కౌలుదారులు, స్వయం సహాయక సంఘాలు అర్హులు.