నర్సంపేట - Tamil_Nadu

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా
కోరిక తీర్చలేదని సినిమా నుంచే తీసేశారు: విద్యాబాలన్
Oct 16, 2026, 05:10 IST/

కోరిక తీర్చలేదని సినిమా నుంచే తీసేశారు: విద్యాబాలన్

Oct 16, 2026, 05:10 IST
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని వెల్లడించారు. ఒక దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని, అయితే తాను సమయస్ఫూర్తితో వ్యవహరించి తప్పించుకున్నానని తెలిపారు. చెన్నైలో ఉన్నప్పుడు ఒక దర్శకుడు హోటల్ రూమ్‌కి వెళ్దామని పట్టుబట్టాడని, కానీ ఆమె గది తలుపులు తెరిచి ఉంచడంతో ఆ దర్శకుడు వెళ్లిపోయాడని చెప్పారు. కోరిక తీర్చలేదని సినిమా నుంచే తీసేశారని ఆమె తెలిపారు. ప్రస్తుతం విద్యాబాలన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.