నర్సంపేట డివిజన్ మత్తోజీపేటలో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కోతుల వల్ల గ్రామస్తులు, ముఖ్యంగా పిల్లలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కోతుల స్వైరవిహారంతో సాధారణ జనజీవనం అతలాకుతలమవుతోంది. అధికారులు ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.