Sep 10, 2026, 05:09 IST/
మెట్రో సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. ఇద్దరు మహిళలకు జరిమానా!
Sep 10, 2026, 05:09 IST
కోల్కతాలోని నేతాజీ భవన్ మెట్రో స్టేషన్లో విధుల్లో ఉన్న మెట్రో సిబ్బందితో ఇద్దరు మహిళా ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించారు. వెంటనే స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది జోక్యం చేసుకుని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు గాను సదరు ఇద్దరు మహిళలకు తలా రూ.1,000 చొప్పున జరిమానా విధించారు.