
రాయపర్తి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పెళ్లి మహేందర్ రెడ్డి ఎన్నిక
ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తి పరిధిలోని రాయపర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పెళ్లి మహేందర్ రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల జర్నలిస్టులు ఆయన స్వగృహానికి వెళ్లి ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి సత్కరించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మహేందర్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం కావాలని జర్నలిస్టులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు జర్నలిస్టులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.

























