Sep 11, 2026, 17:09 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
పెళ్లి పేరుతో పిలిచి మహిళను హత్య చేసిన నిందితుడు
Sep 11, 2026, 17:09 IST
హన్మకొండ జిల్లా, హాసన్పర్తికి చెందిన తౌటం స్వప్న (40) అదృశ్యం కేసును పోలీసులు హత్యగా ఛేదించారు. బళ్లారికి చెందిన వొద్దిరాజుల బసవరాజు (27) ఆమెను పెళ్లి పేరుతో బళ్లారికి పిలిపించి, గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు. నిందితుడిని పోలీసులు అంబాల–కమలాపూర్ రోడ్డులో శుక్రవారం అరెస్ట్ చేసి, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.