Oct 09, 2026, 03:10 IST/
విమాన ప్రయాణ ఛార్జీలు పెంపు.. ఫ్యూయల్ సర్ఛార్జ్ పెంచిన ఎయిర్లైన్స్
Oct 09, 2026, 03:10 IST
విమాన ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ సంస్థలు ఫ్యూయల్ సర్ఛార్జీలను పెంచాయి. ఈ సవరించిన ఛార్జీలు అక్టోబర్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. దేశీయ విమానాలకు ఎయిర్ ఇండియాలో రూ.400-1,200, ఆకాశ ఎయిర్లో రూ.375-1,150 వరకు పెరిగాయి. అంతర్జాతీయ ప్రయాణాలకు ఎయిర్ ఇండియాలో 55-215 డాలర్లు, ఆకాశ ఎయిర్లో రూ.2,500 వరకు అదనపు భారం పడనుంది.