సంగేమ్ మండలం - Sangem

ఉమ్మడి వరంగల్ జిల్లా
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి ప్రతిష్ఠ
Sep 14, 2026, 17:09 IST/నర్సంపేట
నర్సంపేట

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి ప్రతిష్ఠ

Sep 14, 2026, 17:09 IST
నర్సంపేటలోని గిర్నిబావిలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల హాస్టల్‌లో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సోమవారం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల చెరువులు, నదులు, కాలువలు కలుషితమవుతున్నాయని, మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కలిసిపోయి కాలుష్యాన్ని నివారించవచ్చని ప్రధానోపాధ్యాయులు మల్లయ్య తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.