
రైలు ఢీకొని ఒకరు మృతి
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన సాంబయ్య (60) వరంగల్ పాత రైల్వే గేట్ వద్ద రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. జీఆర్పీ అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





























