Sep 26, 2026, 08:09 IST/
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి మహిళల నిరసన సెగ (వీడియో)
Sep 26, 2026, 08:09 IST
TG: జనగామలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలు వేదికపై ఉన్న మంత్రిని రూ.500కే గ్యాస్, రూ.4 వేల పెన్షన్ హామీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ సూటిగా నిలదీశారు. తమ నిరసన తెలపకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల తీరుపై సభలోని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.