వెంకటాపురం - Venkatapuram

ఉమ్మడి వరంగల్ జిల్లా
చాతారాజుపల్లిలో గణపతికి ప్రత్యేక పూజలు
Sep 17, 2026, 16:09 IST/ములుగు
ములుగు

చాతారాజుపల్లిలో గణపతికి ప్రత్యేక పూజలు

Sep 17, 2026, 16:09 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులోని వెంకటాపూర్ మండలం చాతారాజుపల్లి గ్రామంలో నవరాత్రుల సందర్భంగా గణపతి దేవుడికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మామిడి పవన్, వార్డ్ సభ్యులు మొహ్మద్ అస్లాంపాషా, కాక్కకాయల నితీష్ గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని గణపతిని ప్రార్థించారు. నవరాత్రులలో నాలుగవ రోజు కౌటాం ప్రసాద్-శ్రీలత దంపతులు గణపతికి రకరకాల ప్రసాదాలు నివేదించి, భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య, శంకరయ్య, కుమార్, రాజలింగ, వరమ్మ, ఏశోద తదితరులు పాల్గొన్నారు.