Sep 12, 2026, 11:09 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
మహిళల భద్రతపై మహిళలకు అవగాహన సదస్సు
Sep 12, 2026, 11:09 IST
నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, మహిళలపై జరిగే నేరాలను అదుపు చేయడానికి అందరూ భాగస్వామ్యం కావాలని, తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు అన్నారు. శనివారం హన్మకొండలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు 100 మంది విద్యార్థినులకు సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాల పట్ల అవగాహన కల్పించారు. జాగ్రత్తతో మెలగడం ద్వారా మహిళల భద్రతను మెరుగుపరచవచ్చని ఆయన సూచించారు.