
అన్నపూర్ణేశ్వరిగా శాలినీనగర్ పోచమ్మ
చారిత్రక ఓరుగల్లు నగరంలోని శాలినీనగర్ లో పోచమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు నయనానందకరమైన శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి దివ్య అలంకారంలో భక్తజనకోటికి దర్శనమిచ్చి పునీతులను చేశారు. లోకకల్యాణార్థం ఆలయ ప్రధాన అర్చకులు ఈగ ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ విశేష అభిషేకాలు, పూజాదికాలు శాస్త్రోక్తంగా, కనులపండువగా నిర్వహించారు. దీక్షాధారణ చేసిన భక్తులకు పురోహితులు నియమనిబంధనలను విశదీకరిస్తూ వారిలో ఆధ్యాత్మిక చింతనను మరింతగా పెంపొందించారు.




































