ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 33వ డివిజన్ పరిధిలో ఉన్న 118, 119, 120, 121 పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా 100 శాతం పూర్తయింది. ఎస్ఐఆర్ సూపర్వైజర్ నరసింహ స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని బీఎల్వోలు జ్యోతి, మాధవి, శారద, జయ సమన్వయంతో తమ పరిధిలోని పనులను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా బీఎల్వోలు, బీఎల్ఏలు తమకు సహకరించిన ఎమ్మార్వో, ఎస్ఐఆర్ సూపర్వైజర్ నరసింహ స్వామి ని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్చార్జిలు కొమ్మరాజుల సందీప్, శ్రీనివాస్, దయాసింగ్ తదితరులు పాల్గొన్నారు.