Sep 25, 2026, 17:09 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
మడికొండ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన వేడుకలు
Sep 25, 2026, 17:09 IST
హనంకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గత 11 రోజులుగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం గణనాయకుడి నిమజ్జనంతో ముగిశాయి. నిర్వాహకులు దాసరి సిద్దు, కాళ్ల మళ్ల పరమేష్ మాట్లాడుతూ లంబోదరానికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, ఈరోజు గంగమ్మ ఒడిలోకి పంపుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట, వరంగల్ (వెస్ట్) ప్రాంతాల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.