
పర్వతగిరి ఎస్సైగా రాజ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ
వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్గా రాజ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మడికొండ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేసిన ఆయన ఇటీవల బదిలీల్లో భాగంగా పర్వతగిరికి వచ్చారు. ఆయన రాకతో, గతంలో ఇక్కడ పనిచేసిన బోగం ప్రవీణ్ వర్థన్నపేటకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై రాజ్‌కుమార్‌కు శుక్రవారం ఘన స్వాగతం పలికి, పూల బొకే అందించారు.






































