Sep 15, 2026, 17:09 IST/జనగాం
జనగాం
స్టేషన్ ఘన్పూర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం
Sep 15, 2026, 17:09 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం సమావేశం ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు స్టేషన్ ఘన్పూర్ గర్ల్స్ హైస్కూల్ ఆవరణంలో నిర్వహించనున్నారు. శ్రమశక్తి అవార్డు గ్రహీత కామల్ల ఐలన్న ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని మంగళవారం హనుమకొండ జిల్లా ప్రచార కార్యదర్శి సల్ల రాజ్ కుమార్ యాదవ్ కోరారు.