ఇయర్ బడ్స్ ఎక్కువగా ఉపయోగించేవారికి హెచ్చరిక

76చూసినవారు
ఇయర్ బడ్స్ ఎక్కువగా ఉపయోగించేవారికి హెచ్చరిక
ఇయర్‌బడ్స్‌ను గంటల తరబడి ఉపయోగించడం వల్ల యువతలో వినికిడి సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ శబ్దంతో, ఎక్కువసేపు ఇయర్‌బడ్స్‌ వాడటం వల్ల చెవుల్లో గింగురుమనే శబ్దం (టిన్నిటస్), వినికిడి లోపం వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే కొద్ది సమయం ఇయర్‌బడ్స్‌ వాడాలని, సౌండ్‌ తక్కువగా ఉంచాలని సూచిస్తున్నారు. ఇయర్‌బడ్స్‌ వినియోగించే వారు క్రమం తప్పకుండా వినికిడి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్