గర్భనిరోధక మాత్రలైన 'లెవోనార్జెస్టైల్' 0.75MG/1.5MG ప్యాక్పై తప్పనిసరిగా హెచ్చరిక లేబుల్ ప్రింట్ చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు డ్రాఫ్ట్
నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ మాత్రను వాడాలని, రెగ్యులర్ వాడకానికి కాదని స్పష్టం చేయాలని సూచించింది. ఇది అబార్షన్ మాత్ర కాదని, సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలియజేయాలని పేర్కొంది.