TG: హైదరాబాద్ నగరం అంతా కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిందని సీఎం రేవంత్ అన్నారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గంటలో 2 సెం.మీ. వర్షం పడితే అంతా జలమయం అవుతోందన్నారు. ప్రస్తుతం చాలా దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉందని, పర్యావరణ పరిరక్షణ చేయనందువల్లే ఎల్‌నినో వంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం మనకు ఆహార కొరత లేదని.. కానీ నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.