TG: ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో శ్యాంసుందర్ రెడ్డి అనే రైతు 8 ఎకరాల వరి పంట ఎండిపోకుండా నాలుగు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పారిస్తున్నారు. ఈ ఘటన వార్తల్లో రావడంతో అధికారులు రైతు వద్దకు వెళ్లి బెదిరించారని, కరెంట్ ఉన్నా నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్లతో నీళ్లు పెట్టారని చెప్పించారని ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లోకి వెళ్లి రైతులను అడిగితే విద్యుత్ సరఫరా పరిస్థితి తెలుస్తుందని పలువురు మండిపడుతున్నారు.