
సీజేపీలో రెబల్ వర్గం.. కొత్తగా సీజేపీ-డీ ఏర్పాటు
నీట్ పేపర్ లీక్, విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ(CJP)లో విభేదాలు తలెత్తాయి. CJPపై ఆరోపణలు చేస్తూ మనీష్ బ్రహ్మభట్, CJP-డెమెక్రటిక్ పేరుతో కొత్త వర్గాన్ని ఏర్పాటు చేశారు. CJP అమ్ముడుపోయి, రాజకీయ పార్టీగా మారిందని, టీమ్ కేజ్రీవాల్గా మారిందని బ్రహ్మభట్ ఆరోపించారు. కొత్త టీమ్లో ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం ఉన్న 8 మందిని చేర్చారని, విద్యార్థులకు చోటు కల్పించలేదని ఆయన విమర్శించారు. CJP పేపర్ లీక్ మాఫియాగా మారిపోయిందని బ్రహ్మభట్ ఆరోపించారు.




