
అంతర్జాతీయ వేదికపై మెరిసిన విజయ్ సేతుపతి
న్యూయార్క్‌లోని హిల్టన్ మిడ్‌టౌన్‌లో నవంబర్ 23న జరిగిన 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో, ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రజెంటర్‌గా పాల్గొని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా ఆయన నిలిచారు. వేడుకలో భారత్ నుంచి వీర్ దాస్, రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ నామినేషన్లు పొందినప్పటికీ, అవార్డులు దక్కలేదు. ఈ ఏడాది యునైటెడ్ కింగ్డమ్ అత్యధికంగా 9 అవార్డులను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.




