రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర
మోదీ మహిళా రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని
కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ఆ కోటాను ముస్లింలకు కేటాయించాలనేది ప్రతిపక్షాల కుట్ర అని ప్రధాని
మోదీ సంచలన ఆరోపణలు చేశారు.