అంతరిక్షంలో తమ ఆయుధాలు ఉన్నాయని
అమెరికా స్పేస్ ఫోర్స్ తొలిసారి అధికారికంగా ధ్రువీకరించింది. అయితే అవి ఏ రకమైన ఆయుధాలు, వాటి సామర్థ్యం ఏమిటన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అంతరిక్షంలో
అమెరికా సైనిక సామర్థ్యాలపై చర్చ జరుగుతున్న వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా,
అమెరికా ప్రకటనతో మిగతా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి.