ప్రధాని నరేంద్ర మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డె వెవర్ ప్రశంసలు కురిపించారు.
మోదీ చెప్పే మాటలు, సూచనల నుంచి స్ఫూర్తి పొందవచ్చని, అతను చెప్పే మాటలు మనం వినాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో
మోదీ ఆలోచనలు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. అదే సమయంలో టారిఫ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై పరోక్షంగా విమర్శలు చేశారు.