ఆ ఇద్దరిని వదిలిపెట్టం: ఇరాన్

2చూసినవారు
ఆ ఇద్దరిని వదిలిపెట్టం: ఇరాన్
ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక పాఠశాలపై జరిగిన దాడికి సంబంధించి ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటనలో 168 మంది చిన్నారులు మృతి చెందారని, అందుకు బాధ్యులైన అమెరికా అధికారులు లీ ఆర్‌.టేట్‌, జెఫ్రీ ఇ.యార్క్‌లను పట్టుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ అధికారులు పాఠశాలపై మూడుసార్లు తోమహాక్ క్షిపణులతో దాడికి ఆదేశించారని ఆరోపించింది. వీరికి సొంత పిల్లలు లేరా అని ప్రశ్నిస్తూ, ఈ నేరస్థులను గుర్తుంచుకోవాలని ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్