TG: వినాయక నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడ అన్నదాన ప్రసాదాలు అందిస్తున్నారో తెలుసుకునేందుకు 'Annadhanam Spots' (annadhanamspots.in) అనే వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మనకు దగ్గరలోని అన్నదానం కేంద్రాల లొకేషన్, సమయాలను ఉచితంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తమకు తెలిసిన అన్నదాన వివరాలను వినియోగదారులు స్వయంగా ఈ పోర్టల్లో నమోదు చేయవచ్చు. బ్యాచిలర్లు, హాస్టల్ విద్యార్థులకు ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడనుంది.