క్రెడిట్ కార్డును ఉపయోగించనంత మాత్రాన క్రెడిట్ స్కోరు నేరుగా తగ్గదు. అయితే, దీర్ఘకాలం కార్డును వాడకపోతే బ్యాంకు ఖాతాను మూసివేసే అవకాశం ఉంది. దీనివల్ల మొత్తం క్రెడిట్ పరిమితి తగ్గి, క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరిగి స్కోరుపై పరోక్ష ప్రభావం పడవచ్చు. ఉదాహరణకు, రెండు కార్డులపై కలిపి రూ.2 లక్షల పరిమితి ఉండగా, ఒక కార్డు మూసివేస్తే పరిమితి రూ.లక్షకు తగ్గుతుంది. ఖర్చులు మారకపోతే వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. అధిక వార్షిక రుసుము లేని కార్డును అవసరాలకు అనుగుణంగా అప్పుడప్పుడు వాడి, బిల్లులను గడువులోగా పూర్తిగా చెల్లించడం మంచిది.