
దేశ రక్షణ రంగంలో రూ.770 కోట్లతో కీలక ఒప్పందం
భారత త్రివిధ దళాల ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. లో లెవెల్ లైట్ వెయిట్ రాడార్ల కొనుగోలు కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)తో సుమారు రూ.770 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఫైటర్ జెట్లు, మినీ, మైక్రో డ్రోన్లను గుర్తించి, ట్రాక్ చేసే సామర్థ్యం ఈ రాడార్లకు ఉంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది.




