రేనియం పొడి ధర కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత ప్రభుత్వం క్రిటికల్ మినరల్స్ మిషన్ కింద రేనియం దిగుమతులపై సుంకం మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. బంగారంలో కలుపుతున్నట్లు చెబుతున్న 'గోల్డెన్ రేనియం పొడి' గ్రాము ధర సుమారు రూ.4,811గా ఉంది. కొందరు అక్రమ వ్యాపారులు, స్మగ్లింగ్ ఏజెంట్లు దీన్ని రూ.5,000 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.