గుడ్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఆహారం. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారం. గుడ్డులోని ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి, పచ్చసొనలోని కోలిన్ మెదడు పనితీరుకు తోడ్పడతాయి. రాత్రిపూట కూడా గుడ్లు తినవచ్చు. అయితే ఉడికించిన గుడ్లు తీసుకోవడం మంచిది. యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట నూనెతో చేసిన గుడ్డు వంటకాలకు దూరంగా ఉండాలి. అలాగే, గుడ్లు తినడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ లేదని నిపుణులు చెప్తున్నారు.