విడుదలకు ముందు ‘తెల్ల కాగితం’ సినిమాకు షాక్.. కీలక సన్నివేశాలు లీక్‌

96చూసినవారు
విడుదలకు ముందు ‘తెల్ల కాగితం’ సినిమాకు షాక్.. కీలక సన్నివేశాలు లీక్‌
అక్టోబర్‌ 2న విడుదల కానున్న ‘తెల్లకాగితం’కు షాక్‌ తగిలింది. విడుదలకు మూడు రోజుల ముందు సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కథలో కీలక ఎపిసోడ్లకు సంబంధించిన సీన్లు కావడంతో చిత్రబృందం ఆందోళన చెందుతోంది. సినిమా మొత్తం టెలిగ్రామ్‌లో లీక్‌ అయిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. లీకైన కంటెంట్‌, లింకులను తొలగించేందుకు టీమ్‌ చర్యలు చేపట్టినట్లు సమాచారం. లీకేజీ కావాలనే చేసిందంటూ మరోవైపు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రబృందం త్వరలో వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్