
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ
నవంబర్ 2న బీసీసీఐ రైజింగ్ స్టార్ ఆసియాకప్ మెన్స్ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును ప్రకటించింది. తిలక్ వర్మ కెప్టెన్‌గా, రజిత్ పటిదార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ నవంబర్ 19 నుండి 29 వరకు ఖతార్‌లో జరగనుంది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు ఇందులో చోటు దక్కింది. భారత్ గ్రూపు బిలో ఉండగా, నవంబర్ 20న నేపాల్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. పాక్, నేపాల్, యూఏఈ జట్లు కూడా ఈ గ్రూపులో ఉన్నాయి.




