
కరెంట్ షాక్: విద్యుత్ స్తంభంపైనే కార్మికుడికి సీపీఆర్ (VIDEO)
AP: అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా రాజు అనే ప్రైవేటు విద్యుత్ కార్మికుడు అనుకోకుండా కరెంట్ షాక్కు గురై స్తంభంపైనే చిక్కుకుపోయాడు. అప్రమత్తమైన తోటి సిబ్బంది, స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత వెంటనే స్తంభం పైకి ఎక్కి, అపస్మారక స్థితిలో ఉన్న రాజుకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం అతడిని కిందకు దించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.




