తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనిలోని భిక్షేశ్వరస్వామి ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. ప్రాచీన కాలంలో ‘మంత్రకూటం’, ‘మంత్రపురి’గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం వేద విద్యకు కేంద్రంగా ఉండేదని చెబుతారు. ఇక్కడ శివుడు శైలేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, గౌతమేశ్వరుడు, భిక్షేశ్వరుడు అనే నాలుగు రూపాల్లో కొలువై ఉన్నట్లు భక్తుల విశ్వాసం. భిక్షేశ్వరస్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం, ధ్వజస్తంభం లేకపోవడం ప్రత్యేకతలు. ఒకే గర్భగుడిలో దక్షిణామూర్తి లింగరూపంలో దర్శనమివ్వడం మరో విశేషం. శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.