TG: హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బంగ్లాదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిని ఆమె భర్త ఫయాజ్, తన స్నేహితులు ముజీబ్, కమల్, రెహమాన్‌లతో కలిసి బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి యజమాని తలుపులు పగలగొట్టినప్పుడు బాధితురాలు బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.