
ఏపీకి ముంచుకొస్తున్న మరో రెండు తుఫాన్ల ముప్పు
ఏపీలో మరో రెండు తుఫాన్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బంగాళాఖాతంలో నవంబర్ చివరి వారంలో ఒకటి, డిసెంబర్ రెండో వారంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నవంబర్ 26 తర్వాత అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో శీతాకాలంలో తుఫానుల సంఖ్య పెరుగుతుండటంతో.. తీరప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.




