వాగులో కొట్టుకుపోయిన భార్య.. భర్త సురక్షితం

4చూసినవారు
వాగులో కొట్టుకుపోయిన భార్య.. భర్త సురక్షితం
AP: తూర్పుగోదావరి జిల్లా కోటికేశవరం ఈనుకొండ వాగులో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై కాలువ దాటుతున్న క్రమంలో వరద ఉధృతికి దంపతులు కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో భర్త చక్రి సురక్షితంగా బయటపడగా, ఆయన భార్య సత్యవతి గల్లంతయ్యారు. సత్యవతి చీపురుపల్లిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం గల్లంతైన సత్యవతి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాలువలు, వాగుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

సంబంధిత పోస్ట్