TG: భర్తను ఓ మహిళ కొట్టి చంపిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగింది. అమ్రాబాద్‌కు చెందిన బుర్హానోద్దీన్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో భర్తతో భార్య సఫియాకు తరుచూ గొడవలు జరిగేవి. కుమారులు సైతం ఇలాంటి పనులు మానుకోవాలని తండ్రికి సూచించారు. ఎంతకీ అతనిలో మార్పురాకపోవడంతో ఇద్దరు కుమారులతో కలిసి బుర్హాన్ తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసింది. అనంతరం శవాన్ని పెట్టెలో కుక్కి పారిపోయారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.