గతవారం నష్టాల నుంచి కోలుకుంటూ బంగారం ధరలు నేడు పెరిగాయి. రాబోయే రోజుల్లోనూ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు తగ్గడం, డాలర్ బలహీనపడటం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడితో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గోల్డ్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.