అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక దశలో బ్యారెల్‌కు 94 డాలర్ల కంటే దిగువకు పడిపోయి, ప్రస్తుతం 97.7 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌పై దీని ప్రభావం సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్‌లో 119.9 డాలర్లుగా ఉన్న భారత క్రూడ్ ఆయిల్ ధర, తాజాగా 103.8 డాలర్లకు తగ్గింది. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.