
డిసెంబర్ 4న క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ వివాహానికి ముహూర్తం ఖరారు అయింది. డిసెంబర్ 4న లక్నోలోని హోటల్ రమదాలో వివాహ వేడుక జరగనుంది. రాజకీయ, క్రీడా, సినీ రంగాల నుంచి సుమారు 2,000 మంది అతిథులకు ఆహ్వానం అందింది. అతిథుల జాబితాలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, షారుక్ ఖాన్ ఉన్నారు. ప్రముఖులకు ఈ జంట వివాహ ఆహ్వానాలు అందించింది.




