TG: హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతున్న సంఘటనలో, తట్టి అన్నారం సమీపంలో కుక్కలు పీక్కుతింటున్న మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఓయూ మాణికేశ్వర్ నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు. సెప్టెంబర్ 28న ఆమెపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేసి అక్కడ పడేసే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.