
వృద్ధురాలిపై దూకిన కొండముచ్చు.. బాధితురాలు మృతి
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా బీటీ పాటిల్ నగర్లో నిజామున్నిసా బేగం (91) అనే వృద్ధురాలు కొండముచ్చు దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటి బయట నిల్చుని ఉండగా కొండముచ్చు దూకడంతో ఆమె కిందపడిపోయారు. సాయం చేయడానికి వచ్చిన మరో మహిళపై కూడా కొండముచ్చు దాడి చేసింది. తీవ్రగాయాల పాలైన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.




