
3 నెలల పసికందుపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
ఉత్తరప్రదేశ్ మైన్పురి జిల్లాలో మంగళవారం రాత్రి 3 నెలల పసిపాపపై పొరుగింటి వ్యక్తి జితేంద్ర (35) అత్యాచారం చేశాడు. చిన్నారి ఇంట్లో నిద్రిస్తుండగా, కుటుంబానికి పరిచయమున్న జితేంద్ర వచ్చి, ఆడుకోవడానికి తీసుకెళ్లి ఈ అరాచకానికి పాల్పడి, తిరిగి మంచంపై పడుకోబెట్టి వెళ్ళాడు. పాప విపరీతంగా ఏడుస్తూ, రక్తస్రావం అవ్వడంతో గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతోంది. బుధవారం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.




