మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ మరో విడత ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నెల, నవంబర్, వచ్చే జనవరిలో మూడు విడతల్లో లేఆఫ్‌లు ఉండొచ్చని సమాచారం. అయితే ఎంతమంది
ఉద్యోగాలు కోల్పోతారనే దానిపై స్పష్టత లేదు. వ్యయాల తగ్గింపులో భాగంగా ఫిబ్రవరి 2026లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆశా శర్మ ఈ మార్పులు చేపడుతున్నారు. జులైలోనూ 3,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఎక్స్‌బాక్స్ ప్రకటించింది.