Sep 26, 2026, 15:09 IST/భువనగిరి నియోజకవర్గం
భువనగిరి నియోజకవర్గం
ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
Sep 26, 2026, 15:09 IST
భువనగిరి నియోజకవర్గంలోని బిబినగర్ మండలం వెంకిర్యాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రమేష్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు ఆయనను శనివారం ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి రమేష్ చేసిన కృషిని గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి లక్ష్మీనారాయణ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, చైర్మన్ మహేశ్వరి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.