
అసైన్డ్ భూములపై పెద్దల కన్ను.. తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
తిరుమలగిరి గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 72, 76 అసైన్డ్ లావాని పట్టా కు సంబంధించిన భూములను పరిరక్షించాలని, వందల ఎకరాల కబ్జా అయిన భూమిని కాపాడాలని అసైన్డ్ పట్టాదారులకు పాసుబుక్కులు జారీ చేయాలని తిరుమలగిరి గ్రామానికి చెందిన రైతులు గురువారం రోజున బొమ్మలరామారం మండల తహసిల్దారు రాధకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలగిరి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 72, 76 సర్వేనెంబర్ సంబంధించిన భూమి విషయంలో 22a నిషేధిత జాబితా పై పూర్తి విచారణ జరిపి రైతులకు సంబంధించిన సర్వే నంబర్లను తొలగించి అసైన్డ్ పట్టాదారులకు పౌతి దరఖాస్తుకు వెసులుబాటు కల్పించాలని గ్రామ రైతులు కోరారు.



























