Sep 21, 2026, 11:09 IST/
‘ది ప్యారడైజ్’కు A సర్టిఫికెట్.. నాని టాటూపై సెన్సార్ కత్తెర!
Sep 21, 2026, 11:09 IST
హీరో నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలోని కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్, హింసాత్మక సన్నివేశాల విషయంలో మార్పులకు సూచించినట్లు సమాచారం. మొత్తంగా దాదాపు 21 చోట్ల కట్స్, మార్పులు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే నాని చేతిపై కనిపించే అభ్యంతరకరమైన టాటూను బ్లర్ చేయాలని సెన్సార్ సభ్యులు సూచించినట్లు సమాచారం.